గోదావరి జలాలకు... "తెలుగుదేశం" జల హారతి - jalaharathi
కృష్ణా జిల్లాలో తెలుగుదేశం ఆధ్వర్యంలో గోదావరి జలాలకు హారతి కార్యక్రమం నిర్వహించారు. హనుమాన్ జంక్షన్ సీతారాంపురం వద్ద పట్టిసీమ నీటీకి మాజీ మంత్రి నారా లోకేశ్ హారతి ఇచ్చారు.
tdp-jalaharathi
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో "జలసిరికి హారతి" కార్యక్రమం నిర్వహించింది. మూడేళ్లపాటు వరుసగా గోదావరి జలాలకు హారతి ఇచ్చారు. దీన్ని కొనసాగిస్తూ... కృష్ణా జిల్లాలో తెలుగుదేశం ఆధ్వర్యంలో గోదావరి జలాలకు హారతి కార్యక్రమం కొనసాగించారు. హనుమాన్ జంక్షన్ సీతారాంపురం వద్ద.... పట్టిసీమ నీటికి... తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దేవినేని ఉమ, జవహర్, వంశీ, బచ్చల అర్జునుడు, కొనకళ్ల పాల్గొన్నారు.