ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నందిగామలో జోరుగా తెదేపా ఎన్నికల ప్రచారం - నందిగామలో తెదేపా ఎన్నికల ప్రచారం

కృష్ణాజిల్లా నందిగామ నగర పంచాయతీ ఎన్నికల్లో తెదేపా నేతలు ప్రచారాన్ని ప్రారంభించారు . నందిగామని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని మరో సారి అవకాశం ఇవ్వాలంటూ.. ఇంటింటికి ప్రచారం చేశారు.

TDP
నందిగామలో జోరుగా తెదేపా ఎన్నికల ప్రచారం

By

Published : Feb 18, 2021, 1:52 PM IST

నందిగామ నగర పంచాయతీ ఎన్నికల్లో భాగంగా... తెదేపా ప్రచారాన్ని ప్రారంభించింది. స్థానికంగా ఉన్న వినాయక ఆలయంలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, నగర పంచాయతీ ఛైరపర్సన్​ అభ్యర్థిని శాఖమూరి స్వర్ణలత, వార్డు అభ్యర్థులు కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి.. ఇంటింటికి వెళ్లి ఓట్ల అభ్యర్థించారు.

రాష్ట్రంలో వైకాపాలో అరాచకం రాజ్యమేలుతుంది అని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విమర్శించారు. దోపిడి ప్రభుత్వంలో అన్ని రకాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. నందిగామలో తాగునీరు వారం పది రోజులకు ఒకసారి వస్తున్న పట్టించుకునే వారే లేరని విమర్శించారు. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని ఆరోపించారు. తెదేపా ప్రభుత్వంలో నందిగామను అన్ని రకాలుగా అభివృద్ధి చేశామని ,మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చదవండీ..702 పంచాయతీల్లో మా మద్దతుదారుల విజయం : తెదేపా ప్రకటన

ABOUT THE AUTHOR

...view details