తెదేపా శ్రేణుల అరెస్ట్‌లను నిరసిస్తూ నేడు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పార్టీ పిలుపునిచ్చింది. కరోనా ఉన్నందున నివాసాల్లోనే నేతలు నిరసనలు తెలపనున్నారు. అరెస్టు అవుతున్న నేతలకు తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ కార్యదర్శి లోకేశ్ భరోసానిచ్చారు. ఎవరూ అధైర్యపడొద్దని, పార్టీ అండగా ఉంటుందని వారు హామీ ఇచ్చారు. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు. వరుస అరెస్టుల క్రమంలో భవిష్యత్ కార్యాచరణపై సీనియర్ నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడనున్నారు. నిన్న అరెస్టైన మాజీమంత్రి అచ్చెన్నాయుడిని పరామర్శించేందుకు గుంటూరు జీజీహెచ్‌కు లోకేశ్ వెళ్లనున్నారు.
అరెస్ట్‌లను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు తెదేపా పిలుపు - atchannaidu arrest news
తెదేపా శ్రేణుల అరెస్ట్‌లను నిరసిస్తూ నేడు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పార్టీ పిలుపునిచ్చింది. కరోనా ఉన్నందున నివాసాల్లోనే నేతలు నిరసనలు తెలపనున్నారు. అరెస్టు అవుతున్న నేతలకు తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ కార్యదర్శి లోకేశ్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ కార్యదర్శి లోకేశ్