ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జగన్​ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల లబ్ధిదారులను మోసగించింది'

'నా ఇల్లు నా సొంతం' కార్యక్రమంలో భాగంగా టిడ్కో ఇళ్లను తెదేపా గుడివాడ కన్వీనర్ రావి వెంకటేశ్వరరావు పరిశీలించారు. గృహప్రవేశాలకు సిద్ధంగా ఉన్న ఇళ్లను జగన్ ప్రభుత్వం ఇవ్వకుండా తాత్సారం చేస్తోందని మండిపడ్డారు. లబ్ధిదారులు సొంతింటి కల కోసం వడ్డీకి తీసుకువచ్చి మరి ఇళ్లకు డీడీలు చెల్లించారని, కానీ చివరికి వారికి వైకాపా ప్రభుత్వం కన్నీరు మిగిల్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tdp Gudivada Convener Ravi Venkateswara Rao
టిడ్కో ఇళ్లలో పర్యటించిన తెదేపా గుడివాడ కన్వీనర్

By

Published : Nov 8, 2020, 12:24 PM IST

'నా ఇల్లు నా సొంతం' కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా గుడివాడలోని టిడ్కో ఇళ్లలో తెదేపా గుడివాడ కన్వీనర్ రావి వెంకటేశ్వరరావు పరిశీలించారు. ముందుగా ఎన్టీఆర్ గృహలను పరిశీలించారు. తెదేపా ప్రభుత్వం హయాంలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో గుడివాడలో... సుమారు 8 వేల ఇళ్లను ప్రారంభించి 90శాతం నిర్మాణం పూర్తి చేశారన్నారు. మొదటి దశలో 3200 ఇళ్లు, రెండవ దశలో 5వేల ఇళ్లను నిర్మాణం చేపట్టామన్నారు. ఎన్టీఆర్ హౌసింగ్ ద్వారా సుమారు వెయ్యి ఇళ్ల మంజూరు చేసి నిర్మించినట్లు తెలిపారు.

గృహప్రవేశాలకు సిద్ధంగా ఉన్న ఇళ్లను జగన్ ప్రభుత్వం ఇవ్వకుండా తాత్సారం చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ప్రతిఒక్కరికి ఒక్కరూపాయి కట్టకుండా ఇళ్లను లబ్ధిదారులకు ఇస్తామని చెప్పి... కట్టిన డబ్బులు కూడా తిరిగి ఇప్పిస్తామని జగన్​ ప్రభుత్వం ప్రగల్భాలు పలికి ఇప్పుడు ముఖం చాటేసిందన్నారు. లబ్ధిదారులకు లేనిపోని అపోహలను కల్పించి కోర్టులో ఉన్నాయని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

ఇప్పటికైనా తమ ప్రభుత్వం హయాంలో మంజూరైన ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వాలని, లేకపోతే సంక్రాంతికి లబ్ధిదారులతో ఆ ఇళ్లలో గృహప్రవేశం చేయిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా పట్టణ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, మాజీ కౌన్సిలర్లు , నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చదవండీ...

నా గెలుపు మహిళాలోకం సాధించిన విజయం: కమల

ABOUT THE AUTHOR

...view details