విజయవాడలో తెదేపా తరఫున సినీ నటుడు నందమూరి తారకరత్న ఎన్నికల ప్రచారం చేశారు. సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావును గెలిపించాలని ఓటర్లను కోరారు. ఎన్నికల్లో తెదేపా గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సుస్థిర అభివృద్ధి కోసం మరోసారి చంద్రబాబునే ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
సుస్థిర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం: తారకరత్న - chandra babu
రాష్ట్రం సుస్థిర అభివృద్ధి సాధించాలంటే చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని సినీ నటుడు నందమూరి తారకరత్న ఓటర్లను కోరారు. విజయవాడలో తెదేపా తరపున ఆయన ఎన్నికల ప్రచారం చేశారు.
తారకరత్న ప్రచారం