మాజీ మంత్రి నడకుదిటి నరసింహారావుకు తెదేపా నేత పరిటాల సునీత నివాళులు అర్పించారు. నడకుదిటి చనిపోయిన సమయంలో తనకు కరోనా రావడంతో.. రాలేకపోయానని కంటతడి పెట్టారు. అందరితో సౌమ్యంగా ఉండే కొల్లు రవీంద్రనూ అక్రమ కేసుల్లో ఇరికించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్య అంటే ఏంటో తెలియని వ్యక్తిపై కక్షపూరిత చర్యకు పాల్పడ్డారని మండిపడ్డారు.
paritala sunitha: 'కొల్లు రవీంద్రపై కక్షపూరిత చర్యకు పాల్పడ్డారు' - kollu ravindra arrest
అధికారంలో ఉన్నప్పుడు ఏ వివాదం లేని వ్యక్తి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా హత్యలు చేస్తారని మాజీ మంత్రి పరిటాల సునీత ప్రశ్నించారు. తెదేపా నేత కొల్లు రవీంద్ర నివాసంలో నడకుదిటి నరసింహారావుకు ఆమె నివాళులు అర్పించారు.
మాజీ మంత్రి పరిటాల సునీత
కొల్లు రవీంద్ర మంత్రి అయిన తరువాత మచిలీపట్నంలో అభివృద్ధి జరిగిందని పరిటాల సునీత వెల్లడించారు. అధికారంలో ఉన్నప్పుడు చిన్న వివాదం కూడా దరిచేరనివ్వని వ్యక్తి... ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా హత్యలు ఎలా చేస్తారని పరిటాల సునీత ప్రశ్నించారు.
ఇదీచదవండి.