ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'చంద్రబాబు వల్లే ప్రపంచపటంలో రాష్ట్రానికి గుర్తింపు ' - కృష్ణా జిల్లాలో తెదేపా ఆవిర్భావ దినోత్సవం

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ నేతలు వేడుకలు నిర్వహించారు. కృష్ణా జిల్లాలో సీనియర్ నేతలు, కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేకు కట్ చేశారు.

tdp formation day at krishna district
కృష్ణా జిల్లాలో తెదేపా ఆవిర్భావ దినోత్సవం

By

Published : Mar 29, 2021, 12:53 PM IST

గుడివాడలో..

గుడివాడ తెదేపా కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు వెంగయ్య పార్టీ జెండా ఆవిష్కరించారు. నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబునాయుడు నాయకత్వంలో రాష్ట్రాన్ని ప్రపంచపటంలో గుర్తించే విధంగా ముందుచూపుతో అనేక సంస్థలు మన రాష్ట్రానికి తీసుకువచ్చారని నేతలు అన్నారు. అమరావతిని అభివృద్ధికి అనేక ప్రణాళికలు రచించారని సీనియర్ నాయకులు వాసే మురళి పేర్కొన్నారు.

విజయవాడలో..

గొల్లపూడి ప్రధాన కూడలిలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఘనంగా తెదేపా ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. దేవినేని ఉమామహేశ్వరరావు జన్మదినం కావటంతో భారీ కేకు కత్తిరించి ఆయనకి జన్మదిన శుభకాంక్షలు తెలిపారు కార్యకర్తలు.

విజయవాడ తూర్పు

తెదేపా 40వ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ ఆధ్వర్యంలో పటమట ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. నాయకుల మారినా కార్యకర్తలు ఎల్లప్పుడూ పార్టీ వెంటే ఉంటున్నారని గద్దె రామ్మెహన్‌ స్పష్టంచేశారు. ఎన్టీఆర్‌ ఆశయాలను చంద్రబాబు కొనసాగిస్తున్నారని ఆయన తెలిపారు.

గన్నవరంలో..
గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఆధ్వర్యంలో జరిగాయి. ముందుగా గాంధీ బొమ్మ సెంటర్​లో పార్టీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

మోపిదేవిలో..

మోపిదేవి సెంటర్​లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెదేపా నేతలు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్ చంద్రబాబు ఆలోచన చేసిందేనని... 80 శాతం పూర్తి చేశారని మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు.

ఇదీ చూడండి.
తెదేపా 40వ ఆవిర్భావ దినోత్సవం.. చంద్రబాబు, లోకేశ్ శుభాకాంక్షలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details