ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దళితులపై దాడులకు నిరసనగా తెదేపా నేతల ఆందోళన - నందిగామలో తెదేపా నేతల ఆందోళన

రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా... కృష్ణా జిల్లా నందిగామలో తెదేపా నేతలు ఆందోళన చేపట్టారు. నందిగామ సెంటర్​లో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి... దళిత హక్కులను కాపాడాలంటూ వినతిపత్రం సపర్పించారు.

tdp followers protest in nandigama at krishna district
దళితులపై దాడులకు నిరసనగా తెదేపా నేతల ఆందోళన

By

Published : Aug 13, 2020, 5:30 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ కృష్ణా జిల్లా నందిగామలో తెదేపా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నందిగామ గాంధీ సెంటర్లో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. దళితుల హక్కులను కాపాడాలని విజ్ఞప్తి చేస్తూ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ప్రణాళికబద్దంగా దళితులపై దాడులు చేస్తున్నారని తెదేపా నాయకుడు వీరాస్వామి విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలో వరప్రసాద్ అనే దళితుడిని... ఇసుక మాఫియా విషయంలో ఎదిరించినదుకు పోలీస్ స్టేషన్లో శిరోముండనంచేసి అవమానించడం చాలా దారుణమన్నారు.

ABOUT THE AUTHOR

...view details