కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాలలో వైకాపా, తెదేపా కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో తెదేపాకు చెందిన ముగ్గురు వ్యక్తులపై బీరు సీసాతో ప్రత్యర్థులు దాడి చేశారు. బాధితులను నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మాజీ స్పీకర్ కోడెల వర్ధంతిని కార్యక్రమాన్ని గ్రామంలో నిర్వహించే విషయమై చర్చిస్తుండగా... వైకాపాకు చెందినవారు గొడవకు దిగినట్లు బాధితులు ఆరోపించారు.
పరిటాలలో వైకాపా, తెదేపా ఘర్షణ... ముగ్గురికి గాయాలు - fight
కృష్ణా జిల్లా పరిటాలలో తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటనలో ముగ్గురు తెదేపా కార్యకర్తలకు గాయాలయ్యాయి. కోడెల సంస్మరణ సభను జరిపే అంశంపై మాట్లాడుతుండగా తమపై దాడి చేసినట్లు బాధితులు ఆరోపించారు.
పరిటాలలో వైకాపా తెదేపా అనుచరుల మధ్య ఘర్షణ... ముగ్గురికి గాయాలు