ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా ఏడాది పాలనపై మండిపడ్డ తెదేపా నేతలు - devineni uma on polavaram

వైకాపా ఏడాది పాలనపై తెదేపా నేతలు మండిపడ్డారు. చుక్కాని లేని నావలా వుందని సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎద్దేవా చేశారు. ఒక్కఛాన్స్ అని రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టారని మాజీమంత్రి దేవినేని ఉమా ధ్వజమెత్తారు. పోలవరంపై 12నెలల్లో ప్రభుత్వం చేసిన ఖర్చు సీఎం జగన్ వివరించాలని డిమాండ్ చేశారు.

తెదేపా నేతలు
తెదేపా నేతలు

By

Published : May 23, 2020, 9:47 PM IST

Updated : May 23, 2020, 11:33 PM IST

ఏడాది వైకాపా పాలన తమ వారి ఆలనకే సరిపోయిందని తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. ప్రస్తుత పరిపాలన చుక్కాని లేని నావలా వుందన్నారు. జగ'మేత' చారిత్రక తప్పిదానికి ఏడాదని ఎద్దేవా చేశారు. ఏడాది క్రితం 'ఫ్యాన్' ప్రభంజనం సృష్టించి చరిత్ర రాసిందని చెప్పుకుంటున్న వైకాపా నాయకులు చరిత్రలో 'ఫ్యాన్' వేసుకోలేని పరిస్థితి వచ్చిందని దుయ్యబట్టారు.

ఒక్కఛాన్స్ అని రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టారని మాజీమంత్రి దేవినేని ఉమా ధ్వజమెత్తారు. ఇసుక కొరత సృష్టించి దోపిడిచేస్తున్నారని, పంటలకు మద్దతు ధరలేదని మండిపడ్డారు. ప్రజరాజధాని, సాగునీటి ప్రాజెక్టులు అటకెక్కటంతోపాటు కరెంట్ ఛార్జీల భారం ప్రజల పై మోపారని ఆక్షేపించారు. కంపెనీలు వెనక్కి పోగా నాసిరకం మద్యం బ్రాండ్లతో దోపిడి జరుగుతుండటమే ఏడాది వైకాపా ఘనత అని ఆగ్రహం వ్యక్తంచేశారు.

5 కోట్లమంది భవిష్యత్తు కోసం రైతులు 34వేలఎకరాలు త్యాగంచేస్తే... పదివేలకోట్లు రాజధాని నిర్మాణం కోసం ఖర్చుపెట్టారని గుర్తుచేశారు. 158రోజుల ఉద్యమంలో 65మంది ప్రాణాలర్పించారని ఆవేదన చెందారు. కోర్టులు తీర్పులిస్తున్నా అమరావతిని ప్రజారాజధానిగా కొనసాగిస్తామని ప్రభుత్వం ఎందుకు ప్రకటించడం లేదని నిలదీశారు.

ఒక్క రోజులో 3వేల231.5క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసి పోలవరాన్ని తెదేపా అధినేత చంద్రబాబు గిన్నిస్ రికార్డుల్లో ఎక్కించారని గుర్తుచేశారు. 70శాతం పైగాపూర్తిచేసి 2018కి బెస్ట్ ఇంప్లిమెంటేషన్ అవార్డు తెచ్చారన్నారు.

Last Updated : May 23, 2020, 11:33 PM IST

ABOUT THE AUTHOR

...view details