ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పరీక్షలపై మెుండి పట్టుదల వద్దు' - ఏపీలో పదవ తరగతి పరీక్షలపై తెలుగుదేశం పార్టీ మండిపాటు

కరోనా విలయతాండవం చేస్తుంటే..ముఖ్యమంత్రి జగన్‌ మొండిగా పరీక్షల నిర్వహణకు సిద్ధమయ్యారని... తెలుగుదేశం నేతలు ధ్వజమెత్తారు. విద్యార్థుల ప్రాణాలకు సీఎం బాధ్యత తీసుకుంటారా అని నిలదీశారు

'పరీక్షలపై మెుండి పట్టుదల వద్దు'
'పరీక్షలపై మెుండి పట్టుదల వద్దు'

By

Published : Apr 30, 2021, 3:54 AM IST

'పరీక్షలపై మెుండి పట్టుదల వద్దు'

కరోనా తీవ్రత దృష్ట్యా... మంత్రివర్గ సమావేశం వాయిదా వేయించిన ముఖ్యమంత్రి జగన్‌ పది, ఇంటర్ పరీక్షలను ఎందుకు వాయిదా వేయరని....తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిలదీశారు.సీఎం,మంత్రుల‌వే ప్రాణాలా, ల‌క్షల మంది విద్యార్థుల‌వి ప్రాణాలు కావా అని ఆగ్రహం వ్యక్తంచేశారు. జగన్‌కు పరీక్షల నిర్వహణ ముఖ్యమా లేక విద్యార్థులు ప్రాణాలు ముఖ్యమా అని..... తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు నిమ్మకాయల చిరరాజప్ప నిలదీశారు. పది, ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే........ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల పట్ల జగన్‌కు ఎందుకంత పగని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు.

పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయంతో సీఎం జగన్‌ విద్యార్థులకు విషమ పరీక్ష పెడుతున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు.. కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు నుంచి ముఖ్యమంత్రికి అందే ముడుపుల కోసమే ఈపరీక్షలు నిర్వహిస్తున్నారనే అనుమానం ఉందన్నారు.ఆసుపత్రుల్లో వసతులు,ఆక్సిజన్,మందులు కరోనా రోగులు మరణిస్తుంటే,పరీక్షలు నిర్వహించటమే ముఖ్యమనే మొండిపట్టు సరికాదని సూచించారు.పరీక్షలు నిర్వహిస్తామే మెుండి పట్టుదల వల్ల విద్యార్థులు,వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులుఆందోళనలో ఉన్నారని తెలుగుదేశం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనిత అన్నారు.

విద్యార్థులు, వారి కుటుంబాలు, ఉపాధ్యాయులను దృష్టిలో ఉంచుకొని....... పది, ఇంటర్‌ పరీక్షలను వాయిదా వేయాలని తెదేపా డిమాండ్‌ చేసింది. పరీక్షల రద్దు, లేదా వాయిదాపై హైకోర్టులో దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలు ఇవాళ విచారణకు రానున్నాయి.

ఇవీ చదవండి

కరోనా నిర్ధారణ అయినవారికి 3 గంటల్లోగా బెడ్ కేటాయించాలి: ఆళ్లనాని

ABOUT THE AUTHOR

...view details