కేసుల మాఫీ కోసమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్నారని తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం ఆరోపించారు. రెండేళ్ల కాలంలో రాష్ట్రానికి జగన్.. ఒక్క కొత్త పరిశ్రమనూ తీసుకురాలేదని విమర్శించారు. 32 మంది బలిదానాలతో ఏర్పాటైన విశాఖ ఉక్కు పరిశ్రమను స్వార్ధ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టడం బాధాకరమని అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉవ్వెత్తున్న ఉద్యమం జరుగుతుంటే ముఖ్యమంత్రి, వైకాపా నేతలు ఉద్యమానికి ఎందుకు మద్దతు తెలపటం లేదని నాదెండ్ల బ్రహ్మం ప్రశ్నించారు.
'కేసుల మాఫీ కోసమే రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారు' - విశాఖ ఉక్కు పరిశ్రమ
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంశంపై తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం స్పందించారు. కేసుల మాఫీ కోసమే ముఖ్యమంత్రి జగన్.. రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని ఆక్షేపించారు.
తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం