విజయవాడ దుర్గగుడిలో భారీగా అవినీతి జరిగితే.. కేవలం స్థాయి అధికారులపై చర్యలు తీసుకుని.. అసలు వారిని వదిలేస్తున్నారని తెదేపా మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్నారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో అవినీతికి తెరలేపారని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తక్షణమే మంత్రి వెల్లంపల్లిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అవినీతికి పాల్పడిన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుని భక్తుల మనోభావాలు కాపాడాలన్నారు.
మంత్రి వెల్లంపల్లిని బర్తరఫ్ చేయాలి: జలీల్ ఖాన్ - విజయవాడ దుర్గగుడిలో అక్రమాలు తాజా వార్తలు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తక్షణమే మంత్రి వెల్లంపల్లిని బర్తరఫ్ చేయాలని తెదేపా మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.
tdp ex mla jaleel khan comments on minister vellampalli srinivas