ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'బలహీన వర్గాలపై జరిగిన దాడులపై సీబీఐ విచారణ జరిపించాలి' - pithala sujatha comments on cm jagan latest news

బలహీన వర్గాలపై జరిగే దాడులు, అమానుషాలన్నీ జగన్ కు తెలిసే జరుగుతున్నాయని మాజీ మంత్రి పీతల సుజాత ఆరోపించారు. ఇన్ని జరుగుతున్నా సీఎం తనకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అవమానాలు భరిస్తున్న బలహీన వర్గాలంతా ఏదో ఒకరోజు తిరగబడతారని హెచ్చరించారు. అదే జరిగితే జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ ఖాయమని తెలిపారు.

tdp-ex-minister
tdp-ex-minister

By

Published : Aug 31, 2020, 7:52 PM IST

బలహీన వర్గాలకు ఇంతటి దారుణ పరిస్థితి కల్పించిన జగన్ ప్రభుత్వ దురాగతాలపై సీబీఐ విచారణ జరిపించాలని మాజీ మంత్రి పీతల సుజాత డిమాండ్ చేశారు. కోకొల్లలుగా జరిగే అవమానాలను బలహీన వర్గాలు ఎన్నాళ్లు తట్టుకుంటారని ప్రశ్నించారు. ఆత్మగౌరవంతో బతకడంలో వారికి వారే సాటని తెలుసుకోండని హితవు పలికారు. వారికి జరిగిన, జరుగుతున్న అన్యాయాలపై ముఖ్యమంత్రి ఎందుకు స్పందించరని నిలదీశారు. అనాగరికమైన శిరోముండనాన్ని కొత్తగా రాష్ట్రప్రజలకు పరిచయం చేసింది జగన్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. బలహీన వర్గాల ప్రజలను జగన్ ప్రభుత్వం ఓటు బ్యాంకుగానే చూస్తోందన్న ఆమె.. జగన్ ప్రభుత్వ దుర్మార్గాలను సమర్థిస్తున్న వైకాపాలోని మంత్రులు, ఎమ్మెల్యేలకు అంబేడ్కర్ విగ్రహాలు తాకే అర్హత లేదన్నారు.

ABOUT THE AUTHOR

...view details