ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇసుక అక్రమ క్వారీయింగ్ ఆపాలి: తెదేపా - కృష్ణా జిల్లాలో అక్రమ మైనింగ్

కృష్ణా జిల్లా మాగల్లు ఇసుక ర్యాంపులో జరుగుతున్న అక్రమ క్వారీయింగ్ ఆపివేయాలని డిమాండ్ చేస్తూ.. తెదేపా నేతలు ధర్నాకు దిగారు. అక్రమంగా క్వారీయింగ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

tdp dharnaa in sand ramp in maagallu krishna district
తెదేపా నేతల ధర్నా

By

Published : Jun 7, 2020, 1:28 PM IST

కృష్ణాజిల్లా నందిగామ మండలం మాగల్లు ఇసుక ర్యాంపు దగ్గర తెలుగుదేశం నేతలు ధర్నా నిర్వహించారు. అక్రమ క్వారీయింగ్ ఆపివేయాలని డిమాండ్ చేశారు. మాగల్లు ఇసుక ర్యాంపు సర్వే నెంబర్ 67, 68 కాగా... ప్రభుత్వ పోరంబోకు భూమి సర్వే నెం.65లో క్వారీయింగ్ జరుగుతుందని ఆరోపించారు. అక్రమ క్వారీయింగ్ చేసి కోట్లాది రూపాయలు దోచుకున్న లీజుదారుల లీజు రద్దు చేయాలని కోరారు. వారిపై కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details