పింఛన్ల తొలగింపుతో వృద్ధుల అవస్థలు: తంగిరాల సౌమ్య - పింఛన్లు తొలగించడంపై నందిగామలో తెదేపా నిరసన
పింఛన్ల తొలగింపునకు నిరసనగా కృష్ణాజిల్లా కంచికచర్లలో తెదేపా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పింఛన్లు తొలగించటంతో వృద్దులు, వితంతువులు ఇబ్బందులకు గురవుతున్నారని... వెంటనే అర్హులకు పింఛన్లు అందజేయాలని డిమాండ్ చేశారు.
![పింఛన్ల తొలగింపుతో వృద్ధుల అవస్థలు: తంగిరాల సౌమ్య tdp dharna at nandigama against taking out beneficiaries pensions](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6020979-214-6020979-1581319833459.jpg)
అర్హులైన లబ్దిదారులకు ప్రభుత్వం పింఛన్లు తొలగించడం అన్యాయమని నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. కృష్ణాజిల్లాలోని కంచికచర్ల, చందర్లపాడు మండల పరిషత్ కార్యాలయాల వద్ద తెదేపా ఆధ్వర్యంలో పలువురు నిరసన చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్ లబ్దిదారులకు అన్యాయం చేస్తున్నారని... స్వార్థ రాజకీయాలు మానుకోవాలని సౌమ్య విమర్శించారు. పింఛన్లను తొలగించడంతో వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం అర్హులైన లబ్దిదారులను గుర్తించి వారికి వెంటనే పింఛన్ అందించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలని కోరారు.