ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 25, 2020, 3:03 PM IST

ETV Bharat / state

కొవిడ్ బాధితుల సమస్యలు పరిష్కరించండి: తెదేపా

కరోనా సంబంధిత సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో కలెక్టరును కలిసి కరోనా బాధితుల సమస్యలను వివరించారు. కరోనా బాధితులందరికీ ప్రభుత్వం 10 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించాలని.. జిల్లాల్లో ప్మాస్మా బ్యాంకు ఏర్పాటు చేయాలని కోరారు.

tdp demands
tdp demands

కృష్ణా జిల్లాలో కొవిడ్ బాధితుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ ఇంతియాజ్‌ అహ్మద్ కు తెదేపా నేతలు వినతిపత్రం అందించారు. కొవిడ్‌ బాధితులకు అంబులెన్స్‌లు, రవాణా సౌకర్యం అందుబాటులో ఉంచాలని కోరారు. కరోనా టెస్టులకు ప్రభుత్వం ధర నిర్ణయించకపోవడంతో.. పైవేటు కేంద్రాల్లో దోపిడీ జరుగుతోందని తెలిపారు. 800 రూపాయల యాంటిజెన్‌ టెస్టుకు 5వేల రూపాయలు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఆసుపత్రులు, క్వారంటైన్‌ కేంద్రాల్లో పడకలు పెంచాలని.. రోగులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఆసుపత్రులలో ఆక్సిజన్‌, వైద్య సిబ్బంది కొరత లేకుండా చూడాలన్నారు. మందుల సరఫరాను మెరుగుపరచాలన్నారు.

కరోనా విధుల్లో చనిపోయిన వైద్యులు, నర్సులు, సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి 50 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలన్నారు. మద్యం దుకాణాలను తక్షణమే మూసివేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజలు కరోనా మహమ్మారి నుంచి బయటపడేదాకా.. పాత శ్లాబ్‌ ప్రకారమే కరెంటు బిల్లులు వసూలు చేయాలని తెలిపారు. జీవనోపాధి కోల్పోయిన వారికి నెలకు 5 వేల రూపాయల ఆర్ధికసాయం అందించాలన్నారు. కరోనా కిట్లు, బ్లీచింగ్‌ కొనుగోళ్లు, 104 , 108 అంబులెన్స్‌లు, కొవిడ్‌తో చనిపోయిన వారికి చేసిన అంతిమ సంస్కారాల్లో జరిగిన అవినీతి కుంభకోణాలపై విచారణ జరిపించాలని మాజీ మంత్రి దేవినేని ఉమ, తెదేపా కృష్ణా జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి:లైవ్ వీడియో: రోడ్డు దాటుతూ వరదలో కొట్టుకుపోయిన యువకుడు

ABOUT THE AUTHOR

...view details