TDP Dalith Garjana: జగన్ ప్రభుత్వం రద్దు చేసిన దళిత సంక్షేమ పథకాల సాధన పేరిట నేడు విజయవాడలో తెదేపా ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో "దళిత గర్జన" చేపట్టనున్నారు. విజయవాడ ధర్నాచౌక్ లో పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్రాజు ఆధ్వర్యంలో దళితులు ధర్నాకు సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమానికి అనుమతి లేదని విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా స్పష్టం చేశారు.
నేడు విజయవాడలో 'తెదేపా దళిత గర్జన'.. అమలులో 144 సెక్షన్!
TDP Dalith Garjana: జగన్ ప్రభుత్వం రద్దు చేసిన దళిత సంక్షేమ పథకాల సాధన పేరిట నేడు విజయవాడలో తెదేపా ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో "దళిత గర్జన" చేపట్టనున్నారు. విజయవాడ ధర్నాచౌక్ లో పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్రాజు ఆధ్వర్యంలో దళితులు ధర్నాకు సిద్ధమయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి అనుమతి లేదని విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా స్పష్టం చేశారు.
TDP Dalith Garjana in vijayawada
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమీషనరేట్ లో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్, సెక్షన్ 144 అమలులో ఉందని తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టరాదని పేర్కొన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోతే సీఎం క్యాంపు ఆఫీస్ ముట్టడిస్తామని దళిత సంఘాలు హెచ్చరించాయి.
ఇదీ చదవండి:సీఎం రాకతోనైనా.. వారి నరకయాతనకు అడ్డుపడేనా? వంతెన కల తీరేనా..?