ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇన్​సైడర్ రగడ : వైకాపా నేతలు కొన్న భూముల సంగతేంటని తెదేపా ప్రశ్న - tdp on ycp mlas

రైతు ఉద్యమానికి ప్రభుత్వం భయపడింది కాబట్టే.. ఆందోళనలను పక్కదోవ పట్టించేందుకు ఇన్​సైడర్ ట్రేడింగ్ రాగం అందుకుందని తెలుగుదేశం ఆగ్రహం వ్యక్తం చేసింది.  వైకాపా ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని ఆ పార్టీ నేతలు తేల్చి చెప్పారు. రాజధాని ప్రాంతంలో వైకాపా నేతలు కొనుగోలు చేసిన భూవివరాలను బయటపెడుతూ వీటి సంగతేంటని నిలదీశారు.

Bonda uma
బొండా ఉమ

By

Published : Jan 3, 2020, 6:06 AM IST

మీడియాతో తెదేపా నేత బొండా ఉమ
రాజధాని ప్రాంతంలో తెదేపా నేతలు ఇన్​సైడర్ ట్రేడింగ్​కు పాల్పడి భూములు కొనుగోలు చేశారంటూ వైకాపా చేస్తున్న ఆరోపణలపై తెదేపా ఎదురుదాడికి దిగింది. మంగళగిరి తెదేపా కార్యాలయంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి బొండా ఉమ మీడియా సమావేశం నిర్వహించి వైకాపా నేతల విమర్శలను తిప్పికొట్టారు. ఇన్​సైడర్ ట్రేడింగ్ అంటే వైకాపా నేతలకు అసలు అర్థం తెలుసా అని బొండా ఉమ నిలదీశారు. అరిగిపోయిన రికార్డ్​ని పెయిడ్ ఆర్టిస్టులతో వినిపించారని విమర్శించారు. ఆరోపణలకు ఆధారాలు చూపకుండా వాస్తవాలు చెప్తామ్ నమ్మండి అని అంటుంటే ప్రజలు అమాయకులా అని విమర్శించారు. రాజధానిని 3 ముక్కలు చేయటానికి ఇదేమీ వైకాపా బ్రాంచ్ ఆఫీస్ కాదని ధ్వజమెత్తారు. తమపై అసత్య ఆరోపణలు మాని దమ్ముంటే రైతుల మధ్య తిరగండని సవాల్ చేశారు. వైకాపా ఎమ్మెల్యేలు కొన్న భూముల మాటేంటి?

నంబూరు శంకర్రావు, ఆళ్ల రామకృష్ణ రెడ్డి, శ్రీదేవి, మంత్రి కొడలి నాని, బ్రహ్మనాయుడు, ఏసు రత్నం తదితరులు రాజధాని ప్రాంతంలో భూముల కొనలేదా అని నిలదీశారు. రాజధానిలో భూముల కొనుగోలుపై వైకాపా పదే పదే అవాస్తవాలు చెబుతోందని ఉమ ఆరోపించారు. రెండు జిల్లాలో జరిగిన ప్రతి కొనుగోలును తెలుగుదేశం పార్టీకి అంటగడుతున్నారని ఆక్షేపించారు. కూతురుకి తల్లి ఇచ్చినా తెదేపా వాళ్లే కొన్నారని అంటున్నారని ఆరోపించటమేమిటని నిలదీశారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నీరుకొండలో 5 ఎకరాలు, పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు కొన్న భూములు, వైకాపా నుంచి పోటీ చేసిన ఏసురత్నం రాజధానిలో కొన్న భూములు, ఎమ్మెల్యేలు బ్రహ్మనాయుడు, శ్రీదేవిల భూముల సంగతేంటని నిలదీశారు. కృష్ణా, గుంటూరు జిల్లాలో వైకాపా ఎమ్మెల్యేలు ముసుగు వేసుకుని తిరుగుతున్నారని ఆక్షేపించారు. రాజధాని భూములపై సిట్టింగ్ జడ్జితో పాటు ఎలాంటి విచారణకైనా తెదేపా సిద్ధమని ప్రకటించారు.

బోగస్ వీడియో..!

అసలు గ్రాఫిక్స్ ఏమిటో ఇవాళ బోగస్ వీడియో ద్వారా వైకాపా నేతలు చూపించారని తెలుగుదేశం నేతలు విమర్శించారు. జైలుకెళ్లి వచ్చిన జగన్​ను తమ వద్ద ఉంచుకుని ఇవాళ చంద్రబాబు జైలుకి పంపిస్తామనటం హాస్యాస్పదమన్నారు.

ABOUT THE AUTHOR

...view details