కృష్ణా జిల్లా నందిగామ నగర పంచాయతీ మొదటి కౌన్సిల్ సమావేశం.. చైర్ పర్సన్ మండవ వరలక్ష్మీ అధ్యక్షతన జరిగింది. స్థానిక ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు ఈ సమావేశానికి హాజరయ్యారు. అత్యవసర కౌన్సిల్ సమావేశంలో.. నందిగామలోని రోడ్డును 40 అడుగుల వెడల్పు చేయటానికి ప్రతిపాదన చేయగా తెదేపా కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.
'ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది'
ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని దీని వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని.. ఎమ్మెల్యే జగన్మోహన్ రావు తెలిపారు. రహదారి వెడల్పు చేయాల్సిన అవసరం ఉందని, మాస్టర్ ప్లాన్లో భాగంగానే వెడల్పు కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.