విజయవాడలోని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంటి వద్ద తెదేపా కార్పొరేటర్ చంటి నిరసనకు దిగారు. ప్రొటోకాల్ పాటించలేదని మంత్రి వెల్లంపల్లిని ప్రశ్నిస్తే... అసభ్య పదజాలంతో ధూషించాడంటూ నడిరోడ్డుపై కూర్చొని ఆందోళన చేస్తున్నారు. తన డివిజన్లో మంత్రి వెల్లంపల్లి, మేయర్ రాయన భాగ్యలక్ష్మి పర్యటిస్తున్నట్లు తనకు సమాచారం ఇవ్వలేదని అన్నారు. ఈ విషయంపై కమిషనర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేదని కార్పొరేటర్ చంటి ఆవేదన వ్యక్తం చేశారు. గత వారంలో మంత్రి బొత్స సత్యనారాయణ వచ్చినప్పుడు ప్రోటోకాల్ పాటించలేదని తెదేపా కార్పొరేటర్ బాలస్వామి మంత్రికి ఫిర్యాదు చేశారు.
MINISTER VELLAMPALLI: మంత్రి వెల్లంపల్లి ఇంటి ఎదుట తెదేపా కార్పొరేటర్ నిరసన - TELUGU NEWS
విజయవాడలోని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంటి ఎదుట తెదేపా కార్పొరేటర్ చంటి ఆందోళన చేస్తున్నారు. మంత్రి వెల్లంపల్లి, మేయర్ భాగ్యలక్ష్మి కలిసి తన డివిజన్లో పర్యటించారని, తనకెందుకు చెప్పలేదని మంత్రిని ప్రశ్నిస్తే.. ఇష్టమొచ్చినట్లు తిట్టాడని ఆరోపించారు.
మంత్రి వెల్లంపల్లి ఇంటి ముందు తెదేపా కార్పొరేటర్ నిరసన