ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేడు కొవిడ్ ఆస్పత్రులకు తెదేపా నేతలు.. 'బాధితులకు భరోసా'! - ఈరోజు అన్ని జిల్లాలో తెదేపా బాధితులకు భరోసా కార్యక్రమం వార్తలు

నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్న కొవిడ్ ఆసుపత్రులను.. తెలుగుదేశం పార్టీ నాయకులు సందర్శించనున్నారు. బాధితులకు భరోసా పేరుతో.. రోగులకు అందుతున్న వైద్య సహాయం, మందులు, భోజనం ఇతర సదుపాయాల గురించి తెలుసుకోనున్నారు.

tdp baditulaku bharosa
తెదేపా 'బాధితులకు భరోసా' కార్యక్రమం

By

Published : May 24, 2021, 7:24 AM IST

Updated : May 24, 2021, 8:29 AM IST

కరోనా బాధితులకు అండగా నిలచేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు.. నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్న కొవిడ్ ఆసుపత్రులను సందర్శించనున్నారు. బాధితులకు భరోసా పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారని తెదేపా కేంద్ర కార్యాలయం తెలిపింది.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొంది. కొవిడ్ ఆసుపత్రుల్లో సౌకర్యాలను పార్టీ నేతల బృందం పరిశీలించి.. కరోనా రోగులకు అందుతున్న వైద్య సహాయం, మందులు, భోజనం ఇతర సదుపాయాల గురించి అడిగి తెలుసుకోనున్నారు.

Last Updated : May 24, 2021, 8:29 AM IST

ABOUT THE AUTHOR

...view details