ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వైకాపా ఎంపీ నందిగం సురేష్​పై పోలీసులకు తెదేపా ఫిర్యాదు

By

Published : Feb 3, 2020, 4:47 PM IST

కృష్ణా జిల్లా నందిగామలో ఆదివారం జరిగిన ఘటనకు సంబంధించి వైకాపా ఎంపీ నందిగం సురేష్‌పై తెదేపా నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిరసనకారుల పట్ల ఎంపీనే దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. దుర్భాషలాడిన వ్యక్తి... తమ వారిపై కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు.

tdp complaint on mp suresh to nadigama police
tdp complaint on mp suresh to nadigama police

ఎంపీ సురేష్​ దురుసుగా ప్రవర్తించారని తెదేపా నేతల ఫిర్యాదు
కృష్ణా జిల్లా నందిగామలో ఆదివారం జరిగిన ఘటనను తెదేపా నేతలు ఖండించారు. శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థి సంఘాలు, జేఏసీ నాయకులపై ఎంపీ నందిగం సురేష్ అక్రమంగా కేసులు పెట్టారని మండిపడ్డారు. అమరావతికి మద్దతు కోరినందుకు... వైకాపా ఎంపీ దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. అంతే కాకుండా 14 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేయించారని అన్నారు. ఈ మేరకు ఎంపీ సురేష్‌పై నందిగామ పోలీసులకు మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, అమరావతి జేఏసీ నేతలు ఫిర్యాదు చేశారు.

సంబంధిత కథనాలు:

'మీ అంతు చూస్తా'... విద్యార్థి నాయకులకు వైకాపా ఎంపీ వార్నింగ్..!

ABOUT THE AUTHOR

...view details