లాక్డౌన్తో తీవ్రంగా సతమవుతున్న వలస కార్మికుల పై సరైన రీతిలో ఏపీ ప్రభుత్వం స్పందించలేదని మాజీమంత్రి నిమ్మకాయల చినరాజప్ప దుయ్యబట్టారు. వలస కార్మికుల పై సీఎం నివాసానికి దగ్గర్లోనే తాడేపల్లిలో పోలీసులు లాఠీఛార్జి చేయడం దారుణమన్నారు. వందల కిలోమీటర్లు నడిచివెళ్లే వలస కూలీలను ఈ ప్రభుత్వం గాలికొదిలేసిందని ధ్వజమెత్తారు. వెంటనే వలస కూలీలను వారి స్వగ్రామాలకు పంపే చర్యలుపై దృష్టి పెట్టాలన్నారు. వారికి భోజన, వసతి ఏర్పాట్లు ఎక్కడికక్కడే చేయాలని డిమాండ్ చేశారు.
'వలస కూలీలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం'
ఉపాధి కోల్పోయిన వలస కూలీలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి చినరాజప్ప ఆరోపించారు. వందల కిలోమీటర్లు నడిచి వళ్లే కూలీలపై లాఠీచార్జ్ చేయడం దారుణమన్నారు.
tdp comments