సీఎం జగన్‌కు ప్రజలపై నమ్మకం ఉంటే చంద్రబాబు సవాల్‌ను స్వీకరించాలని తెదేపా నేత చినరాజప్ప అన్నారు. ఎన్నికల ముందు రాజధానిగా అమరావతి ఉంటుందని చెప్పి.. ఇప్పుడు మాట తప్పినందుకు రాజీనామా చేసి ప్రజల తీర్పు కోరాలని డిమాండ్ చేశారు. రాజధానిగా అమరావతి ఉంటేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు.అమరావతి రాజధాని మార్పు అనే అంశం 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల సమస్య అని అన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అమరావతి రాజధానిగా అన్ని విధాల బాగుంటుందని రాష్ట్ర ప్రజలు ఆకాంక్షించారని ఆయన గుర్తించారు. కాని ప్రజల మనోభావాలకు విరుద్ధంగా 151 సీట్లు సాధించామనే గర్వంతోనే జగన్ రాజధాని మార్పు నిర్ణయం తీసుకున్నారని ఆయన ఆరోపించారు.
ప్రజలపై నమ్మకం ఉంటే సీఎం రాజీనామా చేయాలి : చినరాజప్ప
ముఖ్యమంత్రికి ప్రజల మీద నమ్మకం ఉంటే చంద్రబాబు విసిరిన సవాల్‌ను స్వీకరించాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప డిమాండ్ చేశారు. రాజధానిగా అమరావతి ఉంటుందని మాట ఇచ్చి.. ఎన్నికల తరువాత మాటతప్పారని దుయ్యబట్టారు.
tdp