ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

12, 13, 14వ తేదీల్లో మచిలీపట్నం, గుడివాడలో చంద్రబాబు పర్యటన.. - Chandrababu Gudiwada tour

Chandrababu Naidu Gudiwada tour: చంద్రబాబు ఈనెల 12వ తేదీన మచిలీపట్నంలో 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి..' కార్యక్రమం నిర్వహించనున్నట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. అనంతరం అక్కడ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ప్రారంభించి అక్కడే బస చేయనున్నారు. 13వ తేదీన గుడివాడలో చంద్రబాబు రోడ్ షో, బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఆ రాత్రికి గుడివాడలోనే బస చేయనున్న ఆయన, 14వ తేదీ ఉదయం అంబేద్కర్ జయంతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

Etv Bharat
Etv Bharat

By

Published : Apr 6, 2023, 10:33 PM IST

వెనిగండ్ల రాము, గుడివాడ తెలుగుదేశం నేత

Chandrababu Naidu Gudiwada tour details: అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని కృష్ణ జిల్లా గుడివాడలో నిర్వహించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిర్ణయించారు. తన గుడివాడ పర్యటనపై నేతలతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు, నిమ్మకూరులో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ప్రారంభించనున్నారు. ఈ సమావేశంలో అచ్చెన్నాయుడు, వెనిగండ్ల రాము, వర్ల రామయ్య ఇతర నేతలు పాల్గొన్నారు.

చంద్రబాబు ఈనెల 12వ తేదీన మచిలీపట్నంలో 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం రాత్రికి ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు చేరుకోనున్నారు. అక్కడ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ప్రారంభించి అక్కడే బస చేయనున్నారు. 13వ తేదీన గుడివాడలో చంద్రబాబు రోడ్ షో, బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఆ రాత్రికి గుడివాడలోనే బస చేయనున్న ఆయన, 14వ తేదీ ఉదయం అంబేద్కర్ జయంతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. 14వ తేదీ మధ్యాహ్నం నూజివీడులో చంద్రబాబు రోడ్ షో, బహిరంగ సభ జరపాలని నిర్ణయించారు.

చంద్రబాబు గుడివాడ పర్యటనను నేతలందరం కలసికట్టుగా విజయవంతం చేస్తామని గుడివాడ తెలుగుదేశం నేత వెనిగండ్ల రాము స్పష్టం చేశారు. అంబేద్కర్ జయంతిని గుడివాడలో జరపాలని చంద్రబాబును తాము కోరామని, దానికి ఆయన అంగీకరించారని తెలిపారు. గుడివాడ తెలుగుదేశంలో ఎలాంటి విబేధాలు లేవని తేల్చిచెప్పారు. గుడివాడలో చంద్రబాబు పర్యటన ఏర్పాట్లకు జిల్లా నేతలు జరిపిన సమావేశానికి ప్రొటోకాల్ ప్రకారం ఆహ్వానించినట్లు తెలిపారు. సమావేశం జరిగే సమయంలో తాను అందుబాటులో లేనని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో గుడివాడను గెలిచి తీరతామని స్పష్టం చేశారు.

చంద్రబాబు పర్యటన సన్నాహక సమావేశానికి వెనిగండ్ల రామును జిల్లా నేతలు ఆహ్వానించకపోవడంపై ఆయన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ను కలిసి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తాను గుడివాడలో పని చేయాలా..? వద్దా అనే అంశంపై క్లారిటీ ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. గుడివాడ నేతల పంచాయతీ అధినేత వద్దకు చేరింది. అచ్చెన్నాయుడుతో కలిసి వెనిగండ్ల రాము చంద్రబాబుతో భేటీ అయ్యారు. గొడవల్లేకుండా చూసుకోవాలని అచ్చెన్నాయుడుకు చంద్రబాబు సూచించారని, వెనిగండ్ల రామును కలుపుకెళ్లేలా కొనకళ్ల సహా ఇతర జిల్లా నేతలకు చెప్పాలని ఆదేశించినట్లు సమాచారం.

'చాలా రోజుల తరువాత మా అధినేత చంద్రబాబు గుడివాడకు రాబోతున్నారు. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేపడుతున్నాం. మా పార్టీలో అభిప్రాయభేదాలు లేవు. మేమంతా కలిసే వైసీపీపై పోరాడుతాం. అంతే తప్ప మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. నేను వెరే కార్యక్రమానికి వెళ్లినప్పుడు సమావేశం నిర్వహించారు. అంతే, ఇక్కడ ఉన్న వైసీపీ నేత చాలా చెబుతారు. అయితే ప్రజలు అవి నమ్మె స్థితి లేదు, వాళ్లు అవి దృష్టిలో పెట్టుకోవాలి'- వెనిగండ్ల రాము, గుడివాడ తెలుగుదేశం నేత

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details