ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'చంద్రన్న సైనికుడు' డైరీని ఆవిష్కరించిన తెదేపా అధినేత

కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గానికి చెందిన తెలుగు యువత విభాగం నాయకుడు వల్లూరు కిరణ్ రూపొందించిన డైరీని తెదేపా అధినేత చంద్రబాబు ఆవిష్కరించారు. ముఖ్య నాయకుల వివరాలు డైరీలో పొందుపర్చడం అభినందనీయమని అన్నారు. అమరావతి ఉద్యమంపై ఎమ్మెల్సీ అశోక్‍బాబు రూపొందించిన మరో క్యాలెండర్‍ను విడుదల చేశారు.

By

Published : Jan 21, 2021, 7:03 PM IST

Published : Jan 21, 2021, 7:03 PM IST

tdp chief chandra babu
తెదేపా అధినేత

అమరావతిలోని ఎన్టీఆర్ భవన్​లో 'చంద్రన్న సైనికుడు' డైరీని తెదేపా అధినేత చంద్రబాబు ఆవిష్కరించారు. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గానికి చెందిన తెలుగు యువత విభాగం నాయకుడు వల్లూరు కిరణ్ ఈ డైరీని రూపొందించారు. పార్టీ సమాచారాన్ని, ముఖ్య నాయకుల వివరాలు డైరీలో పొందుపర్చడం అభినందనీయమని చంద్రబాబు అన్నారు. పార్టీ పిలుపునిచ్చిన ప్రతీ కార్యక్రమంలోనూ కిరణ్ చురుగ్గా పాల్గొంటున్నారని ఆయన ప్రశంసించారు.

అమరావతి ఉద్యమంపై ఎమ్మెల్సీ అశోక్‍బాబు రూపొందించిన మరో క్యాలెండర్‍ను చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అశోక్ బాబు, అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి, దారపనేని నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:'ఉపాధి హామీ పథకంలో మహిళలకు తీవ్ర అన్యాయం'

ABOUT THE AUTHOR

...view details