చిత్తూరు మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో నామినేషన్ ఉపసంహరణ అలజడి కొనసాగుతోంది. ఫోర్జరీ సంతకాలతో 18వ డివిజన్లోని తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల నామినేషన్లను ఉపసంహరణ చేశారంటూ ఆరోపణలు వచ్చాయి.
అక్కడ ఎన్నికలను నిలుపుదల చేయాలని కోరుతూ... తెదేపా అభ్యర్ధులు హైకోర్టు లో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో తెలుగుదేశం అభ్యర్థుల తరఫున న్యాయవాది కృష్ణారెడ్డి ఈరోజు తన వాదనలు వినిపించనున్నారు.