'జగన్ మొదటి పరిపాలన దెబ్బ... పేదవాడి పొట్టపై పడింది' - ప్రజా చైతన్యయాత్ర విజయవాడలో
జగన్ మొదటి పరిపాలన దెబ్బ... పేదవాడి పొట్టపై పడిందని తెదేపా నేత బొండా ఉమ విమర్శించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో ఆయన ప్రజాచైతన్య యాత్ర నిర్వహించారు. పప్పుల మిల్లు కూడలి నుంచి ఇంటింటికీ తిరుగుతూ.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు.
tdp bonda umamaheshwarao
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో స్థానిక తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు ఆధ్వర్యంలో ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో భాగంగా సెంట్రల్ నియోజకవర్గంలోని పప్పుల మిల్లు కూడలి నుంచి ఇంటింటికీ తిరుగుతూ తొమ్మిది నెలల్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. వైకాపా ప్రభుత్వ పనితీరును రాష్ట్ర ప్రజలు పరిశీలిస్తున్నారని... త్వరలోనే తగిన బుద్ధి చెబుతారని ఆయన అన్నారు.