ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TIDCO: '26 నెలలు గడిచినా వైకాపా ఏ ఒక్క హామీని అమలు చేయలేదు'

టిడ్కో ఇళ్లకు మౌలిక వసతులు కల్పించి, లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా విజయవాడ ధర్నాచౌక్​ వద్ద నిరసనలో పాల్గొన్నారు.

tdp bonda uma protest on tidco homes at vijayawada
విజయవాడలో తెదేపా ధర్నా

By

Published : Jul 17, 2021, 3:06 PM IST

రికార్డుల కోసం కాకుండా, ప్రజల నివాసాల కోసం ఇళ్లను నిర్మించాలని.. తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా ప్రభుత్వానికి సూచించారు. టిడ్కో ఇళ్లకు మౌలిక వసతులు కల్పించి, లబ్ధిదారులకు ఇళ్లను ఇవ్వాలని విజయవాడ ధర్నాచౌక్​లో నిర్వహించిన నిరసనలో ఆయన డిమాండ్​ చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చి 26 నెలలు గడిచినా.. ఏ ఒక్క హామీని అమలు చేయలేదని మండిపడ్డారు.

గృహాలను పూర్తిగా ఉచితంగా నిర్మించి ఇస్తామని చెప్పి, ఇప్పుడు ప్రజలపై భారం వేస్తున్నారని దుయ్యబట్టారు. కరోనాతో రెండేళ్లుగా ప్రజలు ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఇళ్ల పేరుతో భారాలు మోపడం సరికాదని తేల్చిచెప్పారు.

ABOUT THE AUTHOR

...view details