ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎమ్మెల్యే శ్రీదేవి ఆడియోపై విచారణ జరిపించాలి: వంగలపూడి అనిత - కృష్ణాజిల్లాలో తాజా వార్తలు

పేకాట క్లబ్ నిర్వహణ వాటాల్లో తేడాలు రావటంతోనే.. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ప్రాణహాని ఉందంటూ కొత్త నాటకానికి తెర లేపారని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు పోటాపోటీగా పేకాట క్లబ్​లు నిర్వహిస్తూ.. రాష్ట్రాన్ని జూదాంధ్రప్రదేశ్​గా మారుస్తున్నారని ధ్వజమెత్తారు.

tdp anitha comments
tdp anitha comments

By

Published : Nov 7, 2020, 6:28 PM IST

కర్నూలులో మంత్రి గుమ్మనూరు కుటుంబ సభ్యుల పేకాట క్లబ్ సాక్ష్యాధారాలతో బహిర్గతమైన ఘటన మరవకముందే.. తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి భాగోతం బయటకు వచ్చిందని వంగలపూడి అనిత విమర్శించారు. పార్టీ నాయకులతో పేకాట క్లబ్​లు నిర్వహిస్తున్న ఆమె.. ఎమ్మెల్యే పదవికి అనర్హురాలని అనిత అన్నారు.

సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన శ్రీదేవి ఆడియోపై విచారణ జరిపించి తక్షణమే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేకాట క్లబ్​లు నిర్వహించమని ఎమ్మెల్యేనే ఆదేశించటంపై ముఖ్యమంత్రి స్పందించాలన్నారు. అవకాశం ఇస్తే అసెంబ్లీ, సచివాలయాలను పేకాట క్లబ్​లుగా మార్చేందుకు సిద్దంగా ఉన్నారని దుయ్యబట్టారు.

ఇదీ చదవండి;ఔరా ఇస్రో: పీఎస్‌ఎల్‌వీ సీ-49 ప్రయోగం విజయవంతం

ABOUT THE AUTHOR

...view details