ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TDP MLA: 'బీసీ కార్పొరేషన్ల నుంచి భారీగా నిధులు మళ్లించి.. వారి అభివృద్ధి ప్రశ్నార్ధకం చేశారు' - ఏపీ తాజా వార్తలు

బీసీల కోసం బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించాం అంటున్న ప్రభుత్వం.. అందులో మళ్లించిన నిధుల గురించి ఎందుకు మాట్లాడడం లేదని తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ప్రశ్నించారు. రెండేళ్లలో బీసీ కార్పొరేషన్ల నుంచి 18,050 కోట్లు మళ్లించి.. బీసీల అభివృద్ధిని ప్రశ్నార్ధకం చేశారని ఆయన ఆరోపించారు. ఈ విషయమై సీఎం జగన్ కు లేఖ రాశారు.

tdp anagani
tdp anagani

By

Published : Aug 1, 2021, 12:18 PM IST

Updated : Aug 1, 2021, 3:58 PM IST

అభివృద్ధికి, రెక్కల కష్టానికి చిరునామాగా ఉండే బీసీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. బీసీలను ఉద్దరించేశామంటూ చేస్తున్న ప్రసంగాలు, ప్రచారం పచ్చి మోసమని.. సీఎం జగన్ కు రాసిన లేఖలో ఆరోపించారు.రెండేళ్లలో బీసీ కార్పొరేషన్ల నుంచి 18,050 కోట్లు మళ్లించి.. బీసీల అభివృద్ధిని ప్రశ్నార్ధకం చేశారని ఆరోపించారు. బీసీ అభ్యున్నతి పేరుతో హడావుడి చేస్తూ.. ఏ విధంగా బీసీల నిధులు మళ్లించారో సాక్ష్యాధారాలతో బయటపెడుతున్నట్లు తెలిపారు.

బీసీల కోసం బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించాం అంటున్న ప్రభుత్వం.. అందులో మళ్లించిన నిధుల గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. 2019 - 20లో 15వేల కోట్లు కేటాయించినట్లు ప్రకటించి అందులో 10,478 కోట్లు మళ్లించారని.. 2020-21లో 23వేల కోట్లు, 2021-22లో 25వేల కోట్లు బీసీ కార్పొరేషన్ నుంచి మళ్లించారన్నారు. మిగిలిన సొమ్ములో కూడా అధిక భాగం పత్రికా ప్రకటనలకు వెచ్చించారే తప్ప.. బీసీల అభ్యున్నతి కోసం కాదని మండిపడ్డారు.

Last Updated : Aug 1, 2021, 3:58 PM IST

ABOUT THE AUTHOR

...view details