ఇళ్ల స్థలాల పంపిణీ పథకం పేదల కోసం కాదు.. వైకాపా నేతలకు దోచిపెట్టడానికేనని రేపల్లె తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ ఆరోపించారు. పేదల భూములు లాక్కుని మరొకరికి ఇవ్వటం సంక్షేమమా అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో అవినీతి.. సీఎం జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే జరుగుతుందా.. అని ప్రశ్నించారు. ఇళ్ల స్థలాల పేరుతో జరుగుతున్న భూ కుంభకోణాలకు సీఎం ఏం సమాధానం చెప్తారని మండిపడ్డారు.