రాష్ట్రంలో 15 లక్షల మంది కౌలు రైతులుంటే.. 50వేల మందికే రైతు భరోసా అందించడాన్ని మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ తప్పుపట్టారు. కౌలు రైతుల ముసుగులో అసలు రైతులకు అన్యాయం చేశారని విమర్శించారు. అధికారం చేపట్టి ఏడాదిన్నరవుతున్నా.. చంద్రబాబును దూషించటం తప్ప రైతు సంక్షేమానికి చేసింది శూన్యమని ధ్వజమెత్తారు.
'రైతు సంక్షేమానికి ప్రభుత్వం చేసిందేమీ లేదు'
వైకాపా ప్రభుత్వ నిర్వాకం వల్లే రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు. రైతులను ప్రభుత్వం ఆదుకున్న తీరు, రుణాల మంజూరుపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
tdp alapati
ప్రభుత్వ ప్రకటించిన మద్దతు ధరకు.. జరుగుతున్న కొనుగోళ్లకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. దళారీలను ప్రోత్సహిస్తూ అరకొరగా ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం ఇంతవరకూ బకాయిలు చెల్లించలేదని ఆరోపించారు. ఎన్ని ఎకరాల పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆలపాటి రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:ఏపీ, తెలంగాణ ఆర్టీసీ ఎండీల కీలక సమావేశం