TDLP meeting decided to go to the assembly : అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని తెలుగుదేశం శాసనసభ పక్షం నిర్ణయించింది. పోరాటమే అజెండాగా పెట్టుకున్నప్పుడు... ప్రజల కోసం ఎన్ని అవమానాలైన భరిద్దామని నారా లోకేశ్ (Nara Lokesh) స్పష్టం చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టు(Chandrababu Illegal Arrest) అంశంతో పాటు వివిధ ప్రజా సమస్యలపై గళమెత్తేందుకు చట్ట సభల వేదికను వదులుకోకూడదని లోకేశ్ పేర్కొన్నారు. సభలో చేయాల్సిన పోరాటం సభలో చేద్దాం.. వీధుల్లో చేయాల్సిన పోరాటం వీధుల్లో చేద్దాం అని చెప్పారు. చంద్రబాబు అరెస్టు అక్రమమనే విషయాన్ని చట్ట సభ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీఎల్పీ నిర్ణయించింది.
AP Police Special Rules : నేరారోపణ లేకుండానే జైలు..! ఇదీ ఏపీలో తాజా పరిస్థితి
సభలో మైక్ అవకాశం ఇవ్వకుంటే నిరసన ద్వారా అయినా చంద్రబాబు అక్రమ అరెస్టుపై ఉద్యమించాలనిసమావేశం నిర్ణయించింది. మైక్ ఇవ్వకపోవడం, సస్పెండ్ వంటి పరిణామాలు చోటు చేసుకుంటే బయటకు వచ్చి నిరసన తెలిపి ప్రజల్లోకి పార్టీ వాదనను బలంగా తీసుకెళ్లాలని శాసనసభ పక్షం నిర్ణయం తీసుకుంది. తెలుగుదేశం నేతలు అసెంబ్లీ కి వస్తే 70ఎంఎం స్క్రీన్ చూపిస్తామంటూ మంత్రుల వ్యాఖ్యలపైనా సమావేశంలో కీలక చర్చ జరిగినట్లు సమాచారం. వైసీపీకి స్క్రీన్ ప్రెజెంటేషన్ అవకాశం ఇస్తే.. జగన్ అక్రమాస్తుల కేసు (Jagan's embezzlement case) లపై స్క్రీన్ ప్రెజెంటేషన్ కు పట్టుబట్టాలని తెలుగుదేశం నిర్ణయించింది. సభ లోపల అవకాశం ఇవ్వకపోతే జగన్ అవినీతి బాగోతాన్ని బయటకు వచ్చి ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని టీడీపీ నాయకులు నిర్ణయించారు. ఇంకా తదుపరి అరెస్టులు ఉంటాయని ప్రచారం జరుగుతున్నందున అందుకు తగ్గట్టుగా అసెంబ్లీ లోపల, బయటా పార్టీ కార్యాచరణ రూపొందించుకోవాలని పయ్యావుల కేశవ్ సూచించారు.