ఆస్తి విలువ ఆధారంగా పన్ను నిర్ణయించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడాన్ని పన్ను చెల్లింపుదారుల సంఘం వ్యతిరేకించింది. కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ చట్టాలు మార్చాలని చేస్తున్న ప్రయత్నాలు సరికాదన్నారు. భారత రాజ్యాంగం ఏడో షెడ్యూల్ ప్రకారం స్ధానిక సంస్ధలు రాష్ట్రం పరిధిలోనివని... దానికి సవరణలు చేయాలని కేంద్రం షరతులు విధించడం రాష్ట్రాల హక్కులు హరించడమే అవుతుందని విమర్శించారు.
'రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తోంది' - పన్ను చెల్లింపుదారుల సంఘం తాజా వ్యాఖ్యలు
రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తోందని పన్ను చెల్లింపుదారుల సంఘం ఆరోపించింది. ఆస్తి విలువ ఆధారంగా పన్ను నిర్ణయించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు విజయవాడలో ప్రకటించారు.
పన్ను చెల్లింపుదారుల సంఘం