కృష్ణాజిల్లా నూజివీడులోని నందనవనం. తెల్లారితే చాలు ఐఐటీ విద్యార్ధులు, పని వారు, ఇంటివారు, కారులో వచ్చేటోళ్లు, బైక్‌లపై వెళ్లేటోళ్లతో ఆ ప్రాంతమంతా సందడిగా మారుతుంది. అల్పాహారం సేవించేందుకు ఏక్కడి నుంచో అక్కడికి వస్తారు. తోట ప్రాంతానికి చెందిన వీరాస్వామి రెండు దశాబ్దాలుగా అతి చౌక ధరలకే ఇక్కడ అల్పాహారం విక్రయిస్తున్నాడు. వంద నోటు లేనిదే.. విందు లేకుండా పోయిన ఈ రోజుల్లో కేవలం ఐదు, పది రూపాయలకే దోశ, ఇండ్లీ అందిస్తున్నాడు.
అతి తక్కువ ధరలకే అల్పాహారం అమ్ముతుండటంతో.. త్రిబుల్ ఐటీ, మెడిసన్ చదువుతున్న విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి అల్పాహారం తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాకుండా ఇంటికి పార్సిల్స్ తీసుకెళ్లడం ఇక్కడ ఆనవాయితీగా కనిపిస్తుంది. ఐదు రూపాయలకే మిరియాల పాలు ఇక్కడ బాగా ఫేమస్ కూడా. తక్కువ ధరకే మంచి రుచి, శుచి ఉన్న అల్పాహారం దొరుకుతుండటంతో కార్లలో తిరిగేటోళ్లు సైతం ఇక్కడికి వచ్చి తిని పోతున్నారు.