నగరంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న నిషేధిత గుట్కా అక్రమ దందాపై టాస్క్ ఫోర్స్ పోలీసులు నిఘాపెట్టారు. హైదరాబాద్ నుంచి గుంటూరు తరలించి అక్కడనుంచి వివిధ జిల్లాలకు సరఫరా చేస్తున్న అక్రమార్కులను గుర్తించారు. విజయవాడ కమిషనరేట్ పరిధిలోని ఉయ్యూరులో నిషేధిత గుట్కా, ఖైనీ, విదేశీ సిగరెట్లను విక్రయిస్తున్న సుబ్బారావు, రామచంద్రరావు అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 34 లక్షల 85 వేల రూపాయల విలువ చేసే సరకును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సులువుగా డబ్బు సంపాదించేందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నారని టాస్క్ ఫోర్స్ పోలీసులు వెల్లడించారు.
నిషేధిత గుట్కా అక్రమ దందాపై టాస్క్ ఫోర్స్ పోలీసుల కొరడా - టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు తాజా వార్తలు
నిషేధిత గుట్కా అక్రమ దందాపై కృష్ణా జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు కొరడా ఝళిపించారు. హైదరాబాద్ నుంచి గుంటూరుకు అక్రమంగా గుట్కా, ఖైనీ, విదేశీ సిగరెట్లను తీసుకొచ్చి ఇక్కడ నుంచి జిల్లాలకు సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
నిషేదిత గుట్కా అక్రమ దందాపై టాస్క్ ఫోర్స్ పోలీసులు కొరడా