కృష్ణా జిల్లా నందిగామలో హత్యకు గురైన గంటా నవీన్ పార్ధివదేహాన్ని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సందర్శించారు. అతని కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నవీన్ హత్య వెనుక ఉన్న కుట్రను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ దారుణానికి కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. అతని కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
సామాజిక మాధ్యమాల్లో వివాదాస్పద పోస్టుల నేపథ్యంలోనే నవీన్ హత్యకు గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు. కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.