ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హడావుడిగా అచ్చెన్నను డిశ్చార్జ్‌ ఎందుకు చేశారు..?: తెదేపా నేత తంగిరాల సౌమ్య - విజయవాడలో తంగిరాల సౌమ్య ధర్నా

మాజీ మంత్రి అచ్చెన్నాయుడును బలవంతంగా జైలుకు తరలించడాన్ని ఖండిస్తున్నామని తెదేపా మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. అచ్చెన్న పూర్తిగా కోలుకోకుండానే ఆయనను ఎలా డిశ్చార్జ్‌ చేస్తారని..., జగన్ కక్షపూరిత శైలికి ఇది నిదర్శనమని ఆమె మండిపడ్డారు.

tangirala sowmya protest agaist on atchennaidu discharged
విజయవాడలో తంగిరాల సౌమ్య ధర్నా

By

Published : Jul 2, 2020, 3:35 PM IST

మాజీ మంత్రి అచ్చెన్నాయుడును బలవంతంగా జైలుకు తరలించడాన్ని ఖండిస్తున్నామని విజయవాడలో తెదేపా మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. వైకాపా ప్రభుత్వ దుర్మార్గపు చర్యలతో వైద్యులపై ఒత్తిడి తెచ్చి అచ్చెన్నాయుడిని డిశ్చార్జ్ చేశారని ఆమె ఆరోపించారు. అచ్చెన్నాయుడికి ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు. మేజిస్ట్రేట్ చెప్పినా వినకుండా డిశ్చార్జ్ చేసి జైలుకు ఎందుకు పంపారని ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వం ఇకనైనా కక్షసాధింపు చర్యలు మానుకోవాలని సూచించారు. ఎర్రన్నాయుడు కుటుంబంపై జగన్ పగబట్టారని సౌమ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను జైలుకెళ్లారు కాబట్టి అందరినీ జైలుకు పంపాలని జగన్‌ కక్ష కట్టారని అన్నారు. జైలుకు తరలించే ముందు అచ్చెన్నకు కోవిడ్ టెస్టులు చేయలేదని, హడావుడిగా అచ్చెన్నను జైలుకు తరలించడం దారుణమని సౌమ్య మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details