తెదేపాపై తమ్మినేని విమర్శలు - ప్రకాశం జిల్లా ఒంగోలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని నీరుగారుస్తోందని వైకాపా నేత తమ్మినేని సీతారాం విమర్శించారు.
తెదేపాపై తమ్మినేని విమర్శలు
ప్రకాశం జిల్లా ఒంగోలులో వైకాపా కార్యాలయ ప్రారంభాన్ని అడ్డుకోవడంపై ఆ పార్టీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం స్పందించారు. చెప్పులతో కార్యకర్తలపై దాడి చేయటాన్ని హేయమైన చర్యగా విజయవాడల మీడియా సమావేశంలో అభివర్ణించారు. అధికార పార్టీ ప్రజాస్వామ్యాన్ని విస్మరిస్తోందన్నారు. ఓటరు జాబితాలో పేర్లను ఎలా తొలగిస్తారన్న ఆయన... ఎన్నికల కమిషన్ ఇచ్చే సమాచారాన్ని స్వప్రయోజనాల కోసం తెదేపా వాడుకుంటోందని ఆరోపించారు.