కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో 32 వేల ఎకరాలకు సాగు నీరందించే... తమ్మిలేరు జలాశయ నిర్వహణను అధికారులు గాలికి వదిలేశారు. ఏళ్లుగా మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల లాకులు శిథిలావస్థకు చేరాయి. దాదాపు నెల రోజులుగా.. నీరు వృథాగా పోతూనే ఉంది. జలాశయంలో ఉన్న వరద నీటిని రబీ సాగుకు వినియోగించుకోవాలంటే లాకుల ద్వారా వృథాను అరికట్టాలని తమ్మిలేరు ఆయకట్టు రైతులు కోరుతున్నారు. ఎగువ నుంచి మళ్లీ వరద వచ్చే అవకాశాల్లేవని అన్నదాతలు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిధుల సమస్య ఉందని.. తాత్కాలికంగా నీటి వృథాను అరికట్టేందుకు చర్యలు చేపడతామని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
అధికారులు నిర్లక్ష్యం.. తమ్మిలేరు జలాశయం నీరు వృథా.. - తమ్మిలేరు జలాశయం న్యూస్
కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో 32 వేల ఎకరాలకు సాగు నీరందించే... తమ్మిలేరు జలాశయ నిర్వహణ గాల్లో దీపంలా మారింది. ఏళ్లుగా మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల లాకులు శిథిలావస్థకు చేరాయి.
tammileru-reservoir