ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుడివాడలో తమిళనాడుకు చెందిన దొంగలముఠా సభ్యుడి అరెస్టు - Tamil Nadu gang latest news update

హైవేలపై లోడుతో వెళ్తున్న లారీలను వెంబడించి సరుకును దొంగిలించే ముఠాను గుడివాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈమేరకు డీఎస్పీ, సిబ్బందిని అభినందించి వివరాలు వెల్లడించారు.

Tamil Nadu gang member arrested in Gudivada
పోలీస్ సిబ్బందిని అభినందించిన డీఎస్పీ

By

Published : Oct 16, 2020, 8:50 PM IST

లోడుతో వెళ్తున్న లారీని వెంబడించి అందులో ఉన్న విలువైన వస్తువులను దొంగిలించే తమిళనాడుకి చెందిన ముఠాలోని సభ్యుడుని సినీ ఫక్కిలో అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు. కృష్ణా జిల్లా గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషను పరిధిలో గూడవల్లి ఐటీసీ గోడౌన్ నుంచి సిగరెట్ లోడుతో వస్తున్న లారీని మరొక వాహనంతో తమిళనాడుకు చెందిన ఐదుగురు వ్యక్తులు వెంబడించి, డ్రైవర్​కి తెలియకుండా లారీలో ఉన్న సుమారు మూడు లక్షల విలువైన సిగరెట్ కార్టన్​లను దొంగిలించినట్లు పేర్కొన్నారు. ఐటీసీ కంపెనీ వాళ్లు ఇచ్చిన ఫిర్యాదుతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్పీ స్పష్టం చేశారు. దర్యాప్తులో భాగంగా తమిళనాడుకు చెందిన వారుగా నిర్థారించుకొని ఆ దిశగా విచారణ చేపట్టినట్లు తెలిపారు‌.

దొంగతనం చేసిన ఐదుగురు సభ్యులు ఉన్న ఈ ముఠాలో వీరన్న అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా మిగిలిన విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. నిందితుడి నుంచి రెండు కార్టన్ సిగరెట్​లు, రెండు కేజీలు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు రవీంద్రనాథ్ బాబు వెల్లడించారు. మరో నలుగురు వ్యక్తులు కోసం గాలింపు కొనసాగుతోందని తెలిపారు. దర్యాప్తు కీలకపాత్ర పోషించిన సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సత్యానందం, క్రైం డీఎస్పీ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి...'ఉన్మాద చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు'

ABOUT THE AUTHOR

...view details