గతంలో యువత చేతుల్లో సాహిత్య, సామాజిక రంగాలకు చెందిన పుస్తకాలు విరివిగా కనిపించేవి. చదివిన పుస్తకాల గురించి విలువైన చర్చలు జరిగేవి. కానీ ప్రస్తుతం అవేమి కనిపించడం లేదు. యువత పూర్తిగా పుస్తక పఠనాన్ని మరిచారు. పుస్తకాల స్థానాన్ని చరవాణీలు ఆక్రమించేశాయి. పుస్తకాలు చదవడం సాహిత్యపరిచయానికో, కాలక్షేపానికో కాదని పఠనం వల్ల వ్యక్తుల మానసిక పరిధి విస్తరిస్తోందని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.
నేటి నుంచి టాక్ ద బుక్ పేరిట కార్యక్రమం ప్రారంభం - vijayawada latest news
యువతలో పుస్తక పఠనంపై ఆసక్తి పెంచడమే లక్ష్యంగా... నేటి నుంచి టాక్ ద బుక్ పేరిట కార్యక్రమం ప్రారంభమవుతోంది. ప్రతి శుక్రవారం ఓ పుస్తకంపై నిపుణుల ఆన్‌లైన్ సమీక్ష నిర్వహిస్తారు.
టాక్ ద బుక్ కార్యక్రమం
ఇందుకనుగుణంగా పుసక్త పఠనంపై విద్యార్ధుల్లో ఆసక్తి పెంచేందుకు ‘టాక్ ద బుక్’ పేరిట ఉన్నత విద్యామండలి నేటి నుంచి ఓ కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. ప్రతి శుక్రవారం ఒక పుస్తకంపై నిపుణులు ఆన్‌లైన్ సమీక్ష నిర్వహిస్తారు. సమీక్షలో యువత ఆయా పుస్తకాల గురించి తెలుసుకుంటారని ఉన్నత విద్యామండలి భావిస్తోంది.
ఇదీచదవండి.