నెల్లూరు జిల్లా నాయుడుపేట 24వ డివిజన్ తెదేపా అభ్యర్థి రాజేంద్రను కులం పేరతో దూషించిన ఎస్ఐ వెంకటేశ్వర్లుపై చర్యలు తీసుకోవాలని తెదేపా ఎమ్మెల్సీ టీడీ జనార్థన్ డిమాండ్ చేశారు. ఎన్నికల నిబంధనలు అతిక్రమించిన ఎస్ఐపై కేసు నమోదు చేసి విధుల నుంచి తప్పించాలని ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు. రాజేంద్రను కులం పేరుతో దూషించటంతో పాటు చొక్కా విప్పించి బహిరంగ ప్రదేశంలో నిలబెట్టటం అమానుషమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'తెదేపా అభ్యర్థిని కులం పేరుతో దూషించిన ఎస్సైపై చర్యలు తీసుకోండి' - తెదేపా అభ్యర్థిని దూషించిన ఎస్సై
నెల్లూరు జిల్లా నాయుడుపేట 24వ డివిజన్ తెదేపా అభ్యర్థి రాజేంద్రను కులం పేరతో దూషించిన ఎస్ఐ వెంకటేశ్వర్లుపై చర్యలు తీసుకోవాలని తెదేపా ఎమ్మెల్సీ టీడీ జనార్థన్ డిమాండ్ చేశారు. ఘటనపై ఎస్ఈసీకి ఫిర్యాదు చేసిన ఆయన..ఎన్నికల నిబంధనలు అతిక్రమించిన ఎస్ఐపై కేసు నమోదు చేయాలన్నారు.
ఎస్ఈసీకి రాసిన లేఖ
Last Updated : Mar 10, 2021, 4:38 PM IST