దర్జీలకు ఏడాదికి రూ. 10,000 ఆర్థిక సహాయంగా అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో పెనుగంచిప్రోలు మండల దర్జీల సంఘం నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. దర్జీలుగా పనిచేసే అందరికీ పథకాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు.
దర్జీలందరికీ న్యాయం చేయండి... - దర్జీలకు ఏడాదికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయంగా అందజేస్తామని ప్రకటించిన ప్రభుత్వం వార్తలు
కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో దర్జీల అంతా కలిసి నిరసన ప్రదర్శన నిర్వహించారు. షాపులు నడిపేవారికే కాకుండా ఇంట్లో దర్జీలుగా పని చేసుకుంటున్నవారిని కూడ ఆదుకోవాలని కోరారు. ఈ మేరకు ఎంపీడీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
దర్జీలందరికీ న్యాయం చేయండి...