రాజస్థాన్‌కు చెందిన కొందరు వలస కార్మికులు.. కృష్ణా జిల్లా మోపిదేవి పరిధిలో బొమ్మలు తయారు చేసి అమ్ముకుంటూ ఉపాధి పొందేవారు. మరికొందరు పానీపూరీ బండ్లు నడుపుతూ సంపాదించుకునేవారు. లాక్ డౌన్ కారణంగా వారికి ఉపాధి లేకుండా పోయింది. చేతిలో ఉన్న డబ్బులు అయిపోగా.. ఆకలితో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య తెలుసుకున్న స్థానిక తహసీల్దార్ ఐవీవీఎస్ఎస్ సుబ్రమణ్య శర్మ.. తన కార్యాలయలో అన్నదానం చేశారు. 4 కుటుంబాలకు ఆహార పొట్లాలు అందించారు.
వలస కార్మికులకు తహసీల్దార్ అన్నదానం - కృష్ణాజిల్లా,మోపిదేవి
కృష్ణా జిల్లా మోపిదేవి పరిధిలో తలదాచుకుంటున్న రాజస్థాన్ వలస కార్మికులకు.. తహసీల్దార్ ఆహార పొట్లాలు పంపిణీ చేశారు.
వలస కార్మికులకు ఆహారం పంపిణి చేసిన తాహసిల్ధార్