ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గేదె తోక పట్టుకుని నదిలో ఈతట...ఎందుకంటే! - swimming at Krishna river by bufellow tail

కుక్క తోక పట్టుకొని గోదారి ఈదడం అని హాస్యాస్పదంగా అంటుంటాం! కానీ దివిసీమ ప్రజలు సరిగ్గా అదే చేస్తున్నారు. కానీ ఇక్కడ తోక ఉంది.. కుక్కే లేదు.. గేదె తోక పట్టుకుని కృష్ణానది ఈదుతున్నారు. ఎందుకబ్బా... అనుకుంటున్నారా? మీరే చూడండి

గేద తోకతో నదిలో ఈతకొడుతున్న కాపరులు

By

Published : Nov 24, 2019, 1:24 PM IST

గేదె తోక పట్టుకుని నదిలో వెళ్తున్న కాపరులు

దివిసీమ ప్రజలు ఎన్నో ఏళ్ళ పోరాట ఫలితమే పులిగడ్డ -పెనుమూడి మధ్య కృష్ణానదిపై నిర్మించిన వారధి. ప్రయాణానికి సులువుగా ఉన్నా... వారధి వల్ల పశుగ్రాసానికి ఇబ్బందులు తలెత్తాయి. అందుచేత కృష్ణానది మధ్య పాయల్లో ఇసుక దిబ్బలపై పశుగ్రాసం కోసం పాడి పశువుల్ని తీసుకెళ్లి అవి కడుపారా తిన్న తరువాత గేదె తోక పట్టుకుని ఈదుకుంటూ వస్తున్నారు.

ఒక్కరోజు రెండు రోజులు కాదు గత 15 సంవత్సరాలుగా సుమారు 10 మంది పశువుల కాపరులు కృష్ణానది పాయల మధ్యలో సుమారు కిలోమీటరు దూరం 100 అడుగుల లోతు ఉన్న నదిలో ప్రమాదకరం అని తెలిసినా జీవనం కోసం నదిని దాటుతున్నారు. అడుగు గల నాలుగు థర్మకోల్ ముక్కలను తాడుతో కట్టి దానిని బొడ్డుకింద పెట్టుకుని నీటిపై తేలటానికి ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని గేదెలు నది మధ్యలోకి వచ్చి ఎటు వెళ్ళకుండా చాలా సమయం అక్కడే ఉండిపోతాయి అలాంటి సందర్భంలో ప్రాణాలు పోయే పరిస్థితి ఉందని కాపరులంటున్నారు.

గతంలో తోట్లవల్లూరు దగ్గర గేదెను పట్టుకుని నది దాటుతుండగా వరదలో కొట్టుకొచ్చిన చెట్టు గేదె కాలికి తగిలి వెనక్కి తిరగడంతో అక్కడే మునిగిపోయి ఒక కాపరి మరణించాడు. ప్రభుత్వం తమకు లైఫ్ జాకెట్​లు ఇచ్చి ఆదుకోవాలని కాపరులు కోరుతున్నారు.

ఇదీ చూడండి

ఈ జైల్లో ఎవరైనా తినొచ్చు..!

ABOUT THE AUTHOR

...view details