విజయవాడ కృష్ణానది తీరాన 'మా తెలుగుతల్లికి మల్లెపూదండ' అంటూ చిన్నారులు గళమెత్తారు. ఆవారా సంస్థ ఆధ్వర్యంలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు కొండవీటి వాగు ప్రాజెక్టు వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. అక్కడి ఉద్యానవనంలోని ప్లాస్టిక్ సీసాలు, కవర్లు ఏరివేసి.. మొక్కలు నాటారు. తెలుగు భాషను కాపాడాలనీ.. మాతృభాష గొప్పదనాన్ని చాటిచెప్పాలంటూ నినాదాలు చేశారు.
'మాతృభాషను కాపాడండి.. తర్వాతి తరాలకు అందించండి' - విజయవాడలో స్వచ్ఛ భారత్
ఆవారా సంస్థ ఆధ్వర్యంలో విజయవాడలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

విజయవాడలో స్వచ్ఛ భారత్