ఘంటశాలలో స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తల పర్యటన - undefined
గాంధీ అడుగుజాడల్లో నడుస్తూ ప్రధాని మోదీ స్ఫూర్తితో స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమాన్ని చేపట్టిన స్వచ్ఛంద కార్యకర్తలు... ఘంటశాలలో పర్యటించారు. రోడ్లు శుభ్రపరిచి, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు.
పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం అనే నినాదంతో కొంతమంది స్వచ్ఛంద కార్యకర్తలు నవంబర్ 12, 2014న స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమాన్ని చేపట్టారు. ప్రతిరోజూ రోడ్లను శుభ్రం చేస్తూ, ఇరువైపులా మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలతో అందరికీ ఆదర్శంగా మారారు. ప్రారంభించిన నాటి నుంచి ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతూ 1762 రోజులు పూర్తి చేసుకుంది. అలాగే ఘంటశాలలోనూ స్వచ్ఛ ఘంటశాల కార్యక్రమాన్ని కొంత మంది ఔత్సాహికులు చేపట్టారు. దీనిని 2015లో ప్రారంభించగా ఇప్పటికీ 1438 రోజులు పూర్తి చేసుకుంది. అయితే ఇవాళ స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలు ఘంటశాలలో పర్యటించారు. చల్లపల్లి నుంచి పాదయాత్రగా బయలుదేరి ఘంటశాలకు చేరుకున్నారు. ప్రధాన కూడలిలో, ఆలయం ముందు చెత్తను స్వచ్ఛ ఘంటసాల కార్యకర్తలతో కలసి శుభ్రపరిచి ప్రజలకు అవగాహన కల్పించారు.